పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో ఉండగానే ప్రజల గురించి ఎక్కువగా ఆలోచించేవారు.  మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో రాష్ట్రం మొత్తం పర్యటించారు.  మెగాస్టార్ పార్టీ తరపున ప్రచారం చేశారు.  యువరాజ్యం బాధ్యతలను తీసుకొని ప్రచారం చేశారు.  పవన్ మెరుపు ప్రచారంతో ప్రజారాజ్యం 18 సీట్లు గెలుచుకుంది.  కొత్తగా వచ్చిన పార్టీ 18 సీట్లు గెలుచుకోవడం అంటే మాములు విషయం కాదు.  అదీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవా సాగుతున్న తరుణంలో.  ఆ తరువాత జరిగిన వివిధ రకాల పరిణామాల నేపథ్యంలో మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.  


అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మెగాస్టార్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు.  ఏ పార్టీనైతే విమాయించారో ఆ పార్టీలో కలవడం పవన్ కు నచ్చలేదు.  ఇది గతం.. 2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు.  అయితే, ఆ సమయంలో రాష్ట్రం ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్న కారణంగా తెలుగుదేశం.. బీజేపీకి సపోర్ట్ చేశారు.  పవన్ ప్రచారంతో టీడీపీ అధికారంలో వచ్చింది.  



అయితే, ఇచ్చిన హామీల విషయంలో తెలుగుదేశం పార్టీ వెనకడుగు వేయడంతో ఆ పార్టీకి దూరం అయ్యాడు పవన్.  2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేశారు.  జనసేన పార్టీ అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది.  అయితే, ప్రచారం చేసుకోవడానికి సమయం లేకపోవడంతో పాటు, జగన్ ప్రజల్లో ఉండటంతో.. ఈసారి అవకాశం జగన్ కు ఇచ్చారు.  ఇక్కడ ట్విస్ట్ ఏమంటే పాన్ గెలుస్తారు అనుకుంటే దారుణంగా ఓడిపోయారు.  ఒక్కసీటు మాత్రమే పవన్ పార్టీ గెలుచుకుంది.  



ఒక్కసీటు గెలుచుకున్న సరే పార్టీని నడిపించి తీరుతామని పవన్ శబదం చేశారు.  పవన్ తో పార్టీలో కలిసి ఉంటామని చెప్పిన చాలామంది నేతలు జనసేన ఓడిపోగానే మొహం చాటేస్తున్నారు.  ఒక్కొక్కరుగా పార్టీ నుంచి తప్పుకొని తిరిగి సొంత పార్టీలోకి వెళ్తున్నారు.  వీరిలో గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన పుట్టి లక్ష్మి సామ్రాజ్యం ఒకరు.  ఆమె జనసేన పార్టీని వీడారు.  పార్టీనుంచి తప్పుకుంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. 


జనసేన పార్టీలో నిబద్దతతో పనిచేసేవారికి స్థానం లేదని, వారికీ తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపణలు చేసింది.  ఈ ఆరోపణలు చేసిన కొద్దిసేపటికే ఆమె బీజేపీలో జాయిన్ అయ్యింది.  బటయకు వెళ్లాలంటే చాలా మార్గాలు ఉంటాయి.. ఇలా నిరాధారమైన ఆరోపణలు చేయడం ఎందుకని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: