పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోను ఓడిపోయాడు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఆశించిన ఫలితాల్ని పొందకపోవటంతో పవన్ కళ్యాణ్ మరలా సినిమాల్లోకి రాబోతున్నాడనే వార్తలు వైరల్ అయ్యాయి. 
 
సినిమాల్లోకి పవన్ రాబోతున్నాడని వార్తలు రావటంతో పవన్ కళ్యాణ్ తాను పూర్తిగా రాజకీయాల్లోనే కొనసాగుతానని సినిమాల్లో నటించే ఆలోచన లేదని స్పష్టం చేసారు. పవన్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చినప్పటికీ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి టీజర్ కు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వటంతో ఈ వార్తలు మరలా మొదలయ్యాయి. నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఒక లేఖ వైరల్ అయింది. 
 
పవన్ గురించి ఇలాంటి వార్తలు రావటంతో జనసేన పార్టీ అధికారిక విభాగం నుండి ఈ విషయం గురించి క్లారిటీ వచ్చింది. ఎవరో ఒక తప్పుడు లేఖను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేసారని నిన్నటినుండి వైరల్ అవుతున్న లేఖలో ఎలాంటి నిజం లేదని జనసేన పార్టీ అధికారిక విభాగం స్పష్టత ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గురించి ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించిన వారిపై జనసేన పార్టీ లీగల్ విభాగం చర్యలు తీసుకోబోతుందని సమాచారం. 
 
జనసేన పార్టీ అధికార విభాగం నుండి క్లారిటీ రావటంతో పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల్లోనే కొనసాగుతాడని సినిమాల్లోకి రాడని స్పష్టమైంది. నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్లో #HappyBirthdayPawanKalyan హ్యాష్ ట్యాగ్ ను కేవలం 37 నిమిషాల్లో  పవన్ కళ్యాణ్ అభిమానులు 10 లక్షల ట్వీట్లు చేసారు.



మరింత సమాచారం తెలుసుకోండి: