రాత్రిపూట నిద్రపోయే సమయంలో రకరకాల కలలు వస్తుంటాయి.  కల రావడం సహజమే. అయితే, కొంతమంది కలను నిజం అనుకోని ఫాలో అవుతారు.  చివరకు భంగపడతారు.  అమెరికాలోని క్యాలిఫోర్నియాకు చెందిన జెన్నా  ఇవాన్స్ అనే మహిళ తన వెడ్డింగ్ రింగ్ ను అమాంతం మింగేసింది.  అది కేవలం కల అనుకున్నది.  కానీ, తెల్లారిన తరువాత చూసుకుంటే చేతికి ఉంగరం లేదు.  ఈ విషయాన్ని భర్తతో చెప్తే నవ్వి ఊరుకున్నాడు.  


కానీ వెడ్డింగ్ రింగ్ చేతికి కనిపించకపోవడంతో షాకైన భర్త.. జెన్నీని తీసుకొని  హుటాహుటిన హాస్పిటల్ కు పరుగులు తీశారు.  హాస్పిటల్ కు వెళ్లిన జెన్నీని ఎక్స్ రే తీస్తే.. ఆమె కడుపులో ఉంగరం ఉన్నట్టు బయటపడింది.  జెన్నీ చెప్పింది విని పాపం డాక్టర్లు సైతం షాక్ అయ్యారు. తరువాత కడుపులో ఉన్న ఉంగరాన్ని డాక్టర్లు బయటకు తీసి జెన్నీకి ఇచ్చారు.  


ఇంతకీ జెన్నీ ఆ ఉంగరాన్ని ఎలా మింగింది.. ఎందుకు మింగింది.. అసలు ఆమెకు వచ్చిన కల ఏంటి అని తెలుసుకోవాలని ఉంది కదా.  అక్కడికే వస్తున్నా.. జెన్నీ నిద్రలో ఉండగా ఆమెకు ఊహించని ఓ కల వచ్చింది. ఆ కలలో జెన్నీ, ఆమె భర్త ట్రైన్ లో ఉండగా.. వారిని కొంతమంది రౌడీలు అటకాయించారట.. భర్త బాబీని రౌడీలు గట్టిగా పట్టుకొని కొడుతున్నారట.  వెంటనే భర్త.. జెన్నీతో.. చేతికి ఉన్న ఉంగరాన్ని మింగేయ్ అని గట్టిగా అరిచి చెప్పాడట.  మారు మాట్లాడకుండా జెన్నీ గ్లాస్ నీళ్లు తీసుకొని ఉంగరాన్ని గుటుక్కున మింగేసింది.  


లేచి చూసిన తరువాత ఉంగరాన్ని మింగింది నిజమే అని డాక్టర్ దగ్గరికి వెళ్లారు.  అది అసలు కథ.  ఉంగరం వరకు ఒకే.. అదే ఎవరినైనా చంపినట్టుగా కల వస్తే.. ఎవరినైనా చంపామన్నట్టుగా కలలో చెప్తే.. జెన్నీ నిజంగా చేస్తుందేమో.  ఏమో చెప్పలేం.  నిద్రలో ఉండగా వాళ్ళు ఏమైనా చెయ్యొచ్చు.  నిద్రలో నడిచే వాళ్ళు ఉన్నారు.. నిద్రలో పెద్దగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు.  కానీ, ఇలా నిద్రలో తెలియకుండానే వింత పనులు చేసేవారుంటే చాలా డేంజర్.  పాపం ఆ భర్త ఆమెతో ఎలా ఉంటాడో ఏమో.  రాత్రిళ్ళు మేలుకొని ఉండి జెన్నీని కాపాడుకోవాలి.. లేదంటే.. బాబీకి కాపాడేవాళ్లు ఉండరు.  దీన్ని మంచి క్రైమ్  సినిమాకు ఓ లీడ్ పాయింట్ గా పెట్టుకోవచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: