ఛత్తీస్ ఘడ్‌ బాలోద్ జిల్లాలో ఓ లారీని పెళ్లి బృందం వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెంగారు. వీరిలో పది మంది మహిళలు ఉన్నారు. 20 మందికిపైగా తీవ్రగాయాలయ్యాయి. క్షత్రగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వ్యాన్ డ్రైవర్ మద్యం సేవించి నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదం దల్లిరాజ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్మూర్ కాసా గ్రామం వద్ద గురువారం తెల్లవారుజామున చోటు బాలోద్ ఎస్పీ షేక్ అరీఫ్ హుస్సేన్ తెలిపారు .


వ్యాన్‌లో సుమారు 40మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. ఎదురువస్తున్న ట్రక్కును వేగంగా ఢీకొనడంతో ఓ మైనర్‌ బాలికతో సహా 10 మంది మహిళలు అక్కడికక్కడే మృతి చెందారని చెప్పారు. మరో 27మంది గాయాలయ్యాయని, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ఎస్పీ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: