ప్రమాదాలు ఎలా ముంచుకు వస్తాయో ఏవరూ చెప్పలేరు..ఆ ప్రమాదాలు భూమి మీదే కావచ్చు..ఆకాశంలో కావచ్చు..నీటిపై కావచ్చు.. తాజాగా అస్సోంలో ఓ పడవ ప్రమాదంలో సుమారు 50 మంది జల సమాధి అయ్యినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..అస్సాం రాష్ట్రంలో  కామ్‌రూప్‌ జిల్లాలోని కలహి నదిలో ఓ పడవ మునిగి పోయింది.. వాస్తవానికి అందులో ఆ పడవలో ప్రయాణీకులు పరిమితికి మించి ఎక్కడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అంటున్నారు.


కలహి నదిలో ప్రయాణిస్తున్న పడవలో సుమారు 200 నుంచి 300 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు అక్మాస్మాత్తుగా పడవ పక్కకు వరిగిపోవడంతో ఒక్కసారిగా పడవ మునిగి పోయింది. దీంతో అందులో ఉన్న వారు చాలా వరకు ఒడ్డుకు కొట్టుకు వచ్చినా సుమారు 50 మంది జలసమాధి అయ్యారని సమాచం.. ఆయితే ఇలాంటి ప్రమాదమే గతంలో 2012 లో జరిగిందని ఆ ప్రమాదంలో సుమారు 40 మంది చనిపోయారని వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని సమాచారం.


 Boat capsizes in Assam, 25 missing

చాయగావ్‌ నుంచి చంపుపరాకు ప్రయాణికులతో పడవ పందేల్లో పాల్గొనేందుకు వెళ్తున్న పడవ ప్రమాదానికి గురైంది. పడవ ఇంజన్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం ఏర్పడటంతో పడవ నది మధ్యలో ఆగిపోయి నదిలో మునిగిపోయనట్టు కామ్‌రూప్‌ డిప్యూటీ కమిషనర్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: