ఈఏడాది ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ 20 వరల్డ్ కప్ షెడ్యూల్ ను మార్చకండి అని ఐసీసీని కోరింది బీసీసీఐ.  అక్టోబర్ - నవంబర్ మధ్యలో ఆస్ట్రేలియా వేదికగా టీ 20 ప్రపంచ కప్ జరుగాల్సి వుంది. అయితే కరోనా నేపథ్యంలో ఈ  ప్రపంచ కప్ ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించుకోవాలని పలువురు మాజీ ఆటగాళ్లు ఐసీసీకి సూచించారు. దీనిపై ఐసీసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ బీసీసీఐ మాత్రం ప్రపంచ కప్ షెడ్యూల్ మార్చొద్దు అంటూ తాజాగా ఐసీసీ ని కోరింది. ఒకేవేళ ప్రపంచ కప్ ను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలనుకుంటే మాత్రం ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానాల్లో టోర్నీ జరిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే దీని పై ఓ క్లారిటీ రానుంది. 
 
ఇక ఇదిలావుంటే కరోనా, క్రీడా రంగం పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈపాటికే ప్రారంభం కావాల్సిన ఐపీఎల్, కరోనా వల్ల  వాయిదా పడింది. ప్రస్తుతం ఇండియాలో కరోనా రోజు రోజుకు విజృభిస్తుంది. దీని ప్రభావం ఎన్ని నెలల ఉంటుందో  ఇప్పుడే చెప్పలేని పరిస్ధితి. దాంతో ఈ ఏడాది ఐపీఎల్ పూర్తిగా  రద్దవడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకవేళ జూలై లోపు పరిస్థితి  పూర్తిగా అదుపులోకి వస్తే ఆగస్టు ,సెప్టెంబర్ మధ్యలో ఐపీఎల్ నిర్వహించే ఛాన్స్  ఉంటుందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
 
ఒకవేళ పూర్తిగా రద్దయితే మాత్రం బీసీసీఐ సుమారు 3000 కోట్ల నష్టం చవిచూడనుందని అంచనా.  ప్రస్తుతానికైతే ఐపీఎల్  నిర్వహణ పై బీసీసీఐ ఎలాంటి ప్రణాళికలు రూపొందించడం లేదు. ఇక కరోనా వల్ల ఒక్క క్రికెటే కాదు ప్రపంచ వ్యాప్తంగా వివిధ క్రీడల నిర్వహణ  స్తంభించిపోయింది. మరో రెండు నెలల వరకు క్రీడల నిర్వహణ కు ప్రభుత్వాలు అనుమతించకపోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: