గడిచిన 56 వ మిస్ ఇండియా 2019 రన్నరప్ గా మన తెలంగాణ ముద్దుబిడ్డ సంజన విజ్ నిలిచింది.  ఫైనల్ లో రాజస్థాన్ కు చెందిన సుమన్ రావు (22) విజేతగా నిలిచింది.  2018 లో మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్న అనుక్రీతి వాష్, సుమన్ రావుకు కిరీటం తొడిగింది.  బీహార్ కు చెందిన శ్రేయ శంకర్, మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ గా ఎన్నికైంది.  డిసెంబర్ 7న థాయిలాండ్లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలకు భారత్ నుండి సుమన్ రావు ప్రాతినిధ్యం వహించనుంది.

 

‘‘యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’’ - స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ప్రత్యక్షమౌతారంటారు. మనం గాని వారికి స్వతంత్రం ఇచ్చి చూస్తే వారు ఏ రంగంలోనైనా రాణించగలరు.  తల్లి దండ్రులు, భర్త, మరియు ఇతర కుటుంబ సభ్యులు వారి అభిరుచికి తగ్గట్టు వారిని పెంచగలిగితే, అద్భుతాలు సృష్టించగలరు.  నేడు మహిళలు అనేక రంగాలలో వున్నత పదవులు పొందుతున్నారు.

 

ఇప్పుడిప్పుడు మన సొసైటీ తీరు మారుతోంది. అడపాదడపా మన తెలుగింటి బిడ్డలుకూడా అందాల పోటీలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇష్టం వున్నా, ఇదివరకు ఇలాంటి ఫ్యాషన్ షోలలో మనవాళ్ళు పాల్గొనేవారు కాదు సరికదా, ఇళ్లలో కూడా టి.వి లలో ఫ్యాషన్ షోలు తిలకించేవారు కాదు, పెద్దలేమన్నా అనుకుంటారేమోనని! కానీ ఇప్పుడు తీరు మారుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: