గత కొన్ని రోజులుగా ఆర్టీసీ  కార్మికులు చేస్తున్న సమ్మె పై శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీని ప్రైవే టుపరం చేయడమే ఉత్తమ ని కేబినెట్ నిర్ణయించింది . కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం రాత్రి విలేకరుల సమావేశంలో వెల్లడిం చారు.ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం లో విలీనం చేసే ప్రశ్నే లేదని ముఖ్యమంత్రి వెల్లడిం చారు. కార్మికుల దురహంకారం గా  సమ్మెకు వెళ్లారని, కార్మికుల డిమాండ్ పై కమిటీ వేసి చర్చ లు చేస్తున్న సమ్మెకు వెళ్లారని, కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట వ్యతిరేకమని అని పేర్కొ న్నారు. దేశంలో ఎక్కడ జరగని విధంగా అమలుకాని డిమాండ్ పెట్టుకొని సమ్మె చేస్తున్నారని సీఎం ప్రశ్నించారు.



ఎవరు ఎవర్ని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఉండకూడదు అందుకే ఆర్టీసీ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నా మని వెల్లడించారు. ఆర్టీసీ ఉండాలి ,ప్రైవేట్ కూడా ఉండాలి నిజానికి ఇప్పుడు చేస్తున్న కార్మికులకు ఆర్టీసీకి సంబంధం లేదని కేసీఆర్ చెప్పారు. నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర మాది కాదని ఎన్నడూ లేనివిధంగా నాలుగే ళ్లలో జీతాలు పెంచా మని, ఔట్సోర్సింగ్ ఉద్యోగు లను రెగ్యులర్ చేశామని అందరి కడుపులు నింపడం మా ఉద్దేశం  కేసీఆర్ అన్నారు. యూనియన్లో మాయలోపడి ఆర్టిసి కార్మికులు మోసపోవద్దని 49 వేల మంది ఆర్టీసీ కార్మికుల పొట్ట కొట్టే ఉద్దేశం లేదని ఆయన వెల్లడించారు.




కార్మిక సంఘాలది బాధ్యతా రాహి త్యం అని నవంబర్ 5వ తేదీలోగా ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి బేషరతుగా విధుల్లో చేరాలని ఆయన కోరారు.ఆర్టీసీ చార్జీలకు పెంచేందుకు కమిటీ ఉందని, బస్ పాసులు , రాయితీలు యధా విధంగా  కొనసాగుతా యని ముఖ్యమంత్రి వివరిం  చారు. బీజేపీ ఎంపీలు ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఆర్చి వారా తీర్చే వార అని ప్రశ్నిం చారు.బిజెపి, కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలో ఉన్న రాష్ట్రా ల్లో ఆర్టీసీని విలీనం చేశారా? అక్కడ లేని విధా నాన్ని తెలం గాణలో ఎందుకు చేస్తున్నారని సూటిగా ప్రశ్నిం చారు. దీనిని రాజకీయ మా ..పేలాలు ఏరుకునే రాజకీయం అంటారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: