మహారాష్ట్రలో ఎన్నికలు ముగిసి పదిరోజులు దాటిపోయింది.  ఎల్లుండితో అక్కడి ప్రభుత్వం ఐదేళ్లు పూర్తవుతుంది.  నవంబర్ 9 తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ ప్రభుత్వం ముందుకు రాకుంటే.. తిరిగి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.  అదే జరిగితే.. అన్ని పార్టీలు ఇబ్బందులు పడతాయి.  ఒక పార్టీకి ప్రజలు అధికారం ఇవ్వకుంటే ఎలా ఉంటుంది అనే దానిపై అన్ని పార్టీలు ప్రచారం చేసే అవకాశం ఉంటుంది.  ఈసారి ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ కూడా ఒంటరిగా పోటీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.  


మహారాష్ట్రలోని నాలుగు ప్రధాన పార్టీలకు ప్రజలు సారైనా మెజారిటీ ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నది.  బీజేపీ-శివసేన, ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు రెండు కూటములుగా ఏర్పడి పోటీ చేశాయి.  కానీ, శివసేన అధికారం విషయంలో మెలిక పెట్టడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి.  శివసేన ఎన్డీఏ లో ఉన్నది.  ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్నప్పుడు సర్దుకుపోవాలి.  కానీ, శివసేన మాత్రం ససేమిరా అంటూ తమకు ముఖ్యమంత్రి పీఠం కావాల్సిందే అని చెప్తోంది.  


ముఖ్యమంత్రి పీఠం కావాలి అంటే బీజేపీ ఇస్తుందా చెప్పండి.  ఉప ముఖ్యమంత్రి పదవి, 13 కేబినెట్ పదవులు ఇవ్వడానికి బీజేపీ ఒప్పుకుంది.  కానీ, దానికి శివసేన ఒప్పుకోకపోవడంతోనే ఈ తిప్పలు వచ్చాయి.  రెండు పార్టీల మధ్య ఈ గొడవ తగ్గలేదు.  బీజేపీ మాత్రం ఇంకా నమ్మకంగానే ఉన్నది.  శివసేన దారికి వస్తుందని, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నమ్ముతున్నది.  


ఇక ముఖ్యమంత్రి ఫడ్నవిస్ అటు బీజేపీ చీఫ్ అమిత్ షాను, ఇటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ ను కలిశారు.  కలిసి అన్ని విషయాలు మాట్లాడారు.  అయితే, మోహన్ భగత్ తో ఏ విషయాల గురించి మాట్లాడారు అన్నది బయటకు రావడం లేదు.  ప్రభుత్వాన్ని మాత్రం తప్పకుండా ఏర్పాటు చేస్తామని బీజేపీ చెప్తున్నది.  ఒకవేళ శివసేన కాదు అంటే.. బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పావులు కదుపుతుందా ఏమో చూడాలి.  కూటమిగా ఉన్న అధికారం మారినా ఆశ్చర్యపోనవసరం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: