ఈ రాశి వారికి గురుడు సంవత్సరమంతా లాభంలో. శని, రాహులు ఇద్దరు సంవత్సరమంతా కూడా తృతీయంలో, కేతువు భాగ్య స్థానంలో సంవత్సరమంతా సంచరిస్తున్నారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సారి మెరుగ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చును.
ఆదాయం: 05 వ్యయం: 05 గౌరవం: 07 అవమానం: 07
ఈ సంవత్సరం అనుకూలమైన కాలంగానే చెప్పుకోవచ్చును చిన్న చిన్న సమస్యలు తప్ప మిగితా అన్ని విషయాల్లో బాగానే ఉంటుంది యోగాదాయకమైన సమయంగానే చెప్పుకోవచ్చును. గతంలో మీరు ప్రారంభించిన పనులను చేపట్టిన పనులను మధ్యలు అనూకూలతలు లేక ఆపినటువంటి పనులను మళ్ళీ ఆరంభిస్తారు విజయవంతంగా పూర్తి చేస్తారు సంతోషాన్ని పొందుతారు మీయొక్క లక్ష్య సాధనలో ఒక అడుగు ముందుకు పడుతుంది అనిచెప్పుకొవచ్చును.
నూతన కార్యక్రమాలను చేపట్టడానికి అలాగే వ్యాపారస్థులకు మంచి సమయం అని చెప్పుకొవచ్చును నూతన వ్యాపారాలు ప్రారంభించుటకు కూడా అనువైన సమయం లాభాలను పొందుతారు ఆర్థికంగా ఎదుగుదల తప్పక ఉంటుంది ఇబ్బందులు కూడా ఉండవు అలాగే ప్రణాళిక కూడా అవసరమే కొద్దిపాటి ప్రయత్నం చేయడం మూలాన విజయాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది పేరును సంపాదించుకుంటారు సంఘంలో గౌరవం పెరుగుటకు చాలామంచి అవకాశాలు కలవు.
నిరుద్యోగులకు చాలా వరకు శుభ సమయంగా భావించవచ్చును గట్టిగా ప్రయత్నం చేయండి ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయి. కళాకారులకు అలాగే క్రీడాకారులకు కలిసివస్తుంది పేరును కలిగి ఉంటారు చేసేపనిలో అభివృద్దిని పొందుతారు మంచి ప్రోత్సాహం లభించుటకు ఆస్కారం ఉంది.
రైతులు గతంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల నుంచి భయట పడుతారు ఈసారి పంటలు బాగా పండుతాయి దిగుబడి మీలో మరల నూతన ఉత్సాహాన్ని నింపుతుంది దైర్యంగా ముందుకు వెళ్ళండి ఆదాయం బాగుంటుంది రుణ భాదలనుంచి భయటపడుతారు.
రాజకీయ నాయకులకు గౌరవం పెరుగుతుంది పలుకుబడిని కలిగి ఉంటారు పదవులు లభిస్తాయి సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చును ఉన్నత పదువులు లాభిస్తాయి ఉద్యోగ మార్పిడి అనుకూలిస్తుంది అభివృద్దిని తప్పక కలిగి ఉంటారు మీ పై అధికారుల యొక్క మన్ననలను పొందుతారు. నూతన ఆలోచనలు చేయండి ముందుకు వెళ్తారు. వివాహం కానివారికి వివాహం అయ్యే సూచనలు కలవు కొద్దిగా ప్రయత్నం చేయండి స్థిరమైన ఆలోచనలు మేలు చేస్తాయి. విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూ లలో విజయాలను పొందుతారు.
మాసముల వారిగా:
ఏప్రిల్: వృదాప్రయాణాలు చేయవలసి రావోచ్చును వాటిని నివారించుకొనే ప్రయత్నం చేయండి అనవసరపు ఖర్చుపెరుగుటకు అవకాశం కలదు. అనారోగ్యం బాదిస్తుంది నిదానంగా వ్యవాహరించుట మేలుచేస్తుంది. స్త్రీలు వృత్తిపరంగా అధికంగా ఉత్సాహంను కలిగి ఉంటారు.
మే: చేపట్టిన పనుల మధ్యలో ఆటంకాలు కలుగుటకు అవకాశం కలదు ఖర్చులు పెరుగుటకు అవకాశం కలదు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
జూన్: ఆదాయం విషయంలో బాగుటుంది నూతన బంధువులు ఏర్పడుటకు అవకాశం కలదు. విద్యార్థులు ఉన్నత విద్యలో ప్రవేశంను పొందుతారు పోటి పరిక్షల్లో విజయం ఉంటుంది. గతంలో చేసిన రుణములను తీర్చుకుంటారు.
జూలై: అన్ని విషయల్లోను బాగానే ఉంటుంది వృ త్తి ఉద్యోగాలలో సమయపాలన అలాగే శ్రమను పొందుట మేలు చేస్తుంది. కొత్త పనులను చేపడుతారు గతంలో వసులుకాని బకాయులు వసులువుతాయి.
ఆగష్టు: శుభ ప్రయత్నాలు ముందుకు కదులుతాయి. చేపట్టిన పనుల్లొ కొంత ఆలస్యాలు ఏర్పడుటకు అవకాశం ఉంది. వ్యాపారస్థులు నిజాయితీగా లేకపోతే కష్టాలను ఎదుర్కొంటారు.
సెప్టెంబర్: అధికారులచే ఒత్తిడిలు పెరుగుతాయి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అగ్రిమెంట్లు అలాగే కోర్టుపనులకు దూరంగా ఉండండి. దైవపూజలు చేయడం మూలాన మానసికంగా బాగుటుంది.
అక్టోబర్: మిశ్రమ ఫలితాలను కలిగి ఉంటారు కొన్ని విషయాల్లో చికాకులు కలుగుతాయి. నూతన పరిచయాలు కలుగుటకు ఆస్కారం కలదు. ప్రయాణములలో తప్పక జాగ్రత్తలు పాటించాలి. వాహనములు నడుపునప్పుడు నిదానంగా వ్యహరించుట మేలు.
నవంబర్: ఉత్సాహంతో పనులను చేపడుతారు కొంత వరకు ముందుకు సాగుతాయి గతంలో ఆగిన పనులను పూర్తి చేస్తారు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి లాభాలను కలిగి ఉంటారు. ఒప్పందముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
డిసెంబర్: మీరు ఆశించిన విధంగానే పనులు ముందుకు సాగుతాయి పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వివాహంనకు సంభందించిన పనులు ముందుకు సాగుతాయి ఉద్యోగులకు అనుకూలమైన సమయం.
జనవరి: ఆదాయ- వ్యయాలను సమానంగా పొందుతారు ఇష్టమైన పనులను పూర్తిచేస్తున్నప్పటికి పని ఒత్తిడి ఉంటుంది. బంధువులను కలుస్తారు.
ఫిబ్రవరి: మిత్రులతో సమయాన్ని ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులు ఉద్యోగస్థానంలో తోటి ఉద్యోగులతో కలిసి పనిచేయుట మంచిది. విదేశీయానములు అనుకూలిస్తాయి. ప్రయాణములు అనుకూలిస్తాయి లాభాన్ని చేకూరుస్తాయి.
మార్చ్: విద్యార్థులకు మేలు జరుగుతుంది మంచి ఆలోచనలు చేయండి. విదేశీ ప్రయత్నాలు కలిసివస్థాయి. వాహనములను మారుస్తారు నూతన వాహనములు సిద్దిస్తాయి. సంతోషంగా గడుపుతారు.
పూజలు: విష్ణుసహస్రనామ పారయణ అలాగే లలితాస్టోత్తరం చదవడం మేలు చేస్తుంది దత్తాత్రేయ స్వామివారిని ఆరాదించుట మేలు చేస్తుంది ప్రతి గురువారం శివాలయం వెళ్ళడం వీలు ఉన్నప్పుడు అభిషేకాలు చేయించుకోండి ప్రతినిత్యం గణపతిని పూజించుట తప్పక మేలుచేస్తుంది. ఉదయాన్నే సూర్యునకు నమస్కారం చేయండి.
దానాలు లేదా జపాలు: గురువునకు శనగలు దానం ఇవ్వండి జపాలు చేయించుకోండి కేతువునకు ఉలువలు దానం ఇచ్చుట జపం మేలుచేస్తుంది గోమాతకు శనగలు గురువారాలు లేదా పచ్చిగడ్డిని బుధవారాలు తినిపించండి.
అదృష్ట సంఖ్యలు: 01, 10, 19, 28.