65 ఏళ్ల ఘనచరిత్ర కలిగిన ఎస్ వి యూనివర్సిటీ అక్కడి సిబ్బంది తిరుతో  అప్రతిష్ఠ మూట కట్టుకునేల  ఉంది. విద్యార్థులకు పాఠాలు బోధించి  మంచి చెడులను అలవర్చాల్సిన  సిబ్బంది... మంచికి చెడుకు తేడా తెలియకుండా ఉన్నారు  అక్కడ. విద్యార్ధులకు రక్షణ కల్పిస్తూ క్రమశిక్షణ నేర్పాల్సిన విశ్వవిద్యాలయ సిబ్బంది... విచక్షణా రహితంగా ప్రవర్తించారు. కనీసం ఒక వికలాంగునికి రక్షణ లేని ఎస్వీ యూనివర్సిటీ లో... ఇక విద్యార్థులకు రక్షణ  ఉంటుందా అని భావిస్తున్నారు విద్యార్థులు . 

 

 

 ఒక వికలాంగులు అయ్యుండి  గౌరవంగా బతికేందుకు ఓ కంపెనీ ప్రతినిధిగా వ్యవహరిస్తుంటే... ఎంతో గౌరవమైన హోదాలో ఉండి కూడా అన్ని ఉన్న వికలాంగులుగా  ప్రవర్తించారు ఎస్వీయూ ఇంచార్జ్ రిజిస్టర్, అక్కడి  కొంత మంది సిబ్బంది. ఒక వికలాంగుడు పై కాదు కాదు... సాటి మనిషి పై చూపించే కనీస జాలి  కూడా ఆ వికలాంగులపై చూపించలేకపోయారు అక్కడి సిబ్బంది. యూనివర్సిటీకి సేవలందించేందుకు వచ్చిన కంపెనీ ప్రతినిధి వికలాంగుడు అని కూడా చూడకుండా... సూటిపోటి మాటలతో దుర్భాషలాడుతూ 30 నిమిషాల పాటు నిర్బంధించి మరి వేధించారట . అయితే ఎంతో ఘనచరిత్ర కలిగిన ఎస్వి  యూనివర్సిటీ లో ఇలాంటి ఘటన జరగడం బాధాకరం అంటే... అది ఒక ఇన్చార్జ్ రిజిస్టర్ కార్యాలయంలో జరగడం... ఇంచార్జ్ రిజిష్టార్  ఎదురుగానే జరగటం...ఈ ఘటనలో ఇంచార్జ్ రిజిష్టర్ కూడా భాగం అవ్వటం  ఎంతో దురదృష్టకరం. 

 

 ఎస్వీయూకి  సేవలందించేందుకు వచ్చిన ఓ కంపెనీ ప్రతినిధి వికలాంగుడు అని కూడా చూడకుండా దాడి చేసి నిర్బంధించి వేధించిన ఇంచార్జ్  రిజిస్టర్,  ఇది తప్పు అని చెప్పాల్సిన ఇతర సిబ్బంది కూడా  దీనికి వత్తాసు పలకి దాడికి ఎస్వీయూ కే    మాయని మచ్చలా  మారింది. అయితే ఈ ఘటన జరిగి పది రోజులైనా అక్కడి ఇంచార్జ్ రిజిష్టర్   కానీ మిగతా సిబ్బంది కానీ తమ తప్పును తెలుసుకోలేక అజ్ఞానం లోనే ఉన్నారు. ఈ ఘటనపై కనీసం స్పందించడం కూడా లేదు. దీంతో ఘన చరిత్ర కలిగిన ఎస్వీయూ  ప్రతిష్టను మంట మంట కలిపే విధంగా  ఇన్చార్జ్ రిజిష్టర్,  కొంత మంది సిబ్బంది తీరు ఉందని పలువురు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా ఎస్వీయూ  ఇన్ఛార్జ్ రిజిస్టర్ తీరు ఉందని పలువురు భావిస్తున్నారు.

 

 

65 సంవత్సరముల ఘన చరిత్ర కలిగి, యావత్ రాయలసీమ, చిత్తూరు మాత్రమే కాక... యావదాంధ్రకు మేధో భాండాగారమై, కలియుగ దైవము శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పేరు మీద నడపబడుతున్న శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం... జన ప్రియ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన రెడ్డి గారి జనప్రియ పారదర్శక పాలనోలనన్నా ప్రక్షాళన కావింపబడి తెలుగు జాతికే గర్వకారణంగా నిలువాలనేదే ... స్వప్రయోజన-స్వార్ధాలకు పాల్పడే వారు కాకుండా యూనివర్సిటీని అభివృద్ది పధాన నడిపే వారు నాయకులుగా ఉండి అందరి హక్కులనూ కాపాడాలనేదే   ఈ పోరాట అంతిమ లక్ష్యం.



వికలాంగునిపై ఎస్వీయూ అఘాయిత్యం గురించి మరిన్ని పరిశోధనాత్మక విశ్లేషణలు: 


మరింత సమాచారం తెలుసుకోండి: